
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొని ప్రసంగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని మంత్రి సంబోధించారు. ‘ఒక మనిషి త్యాగం ఒక జాతి గౌరవం. ఒక మనిషి మరణం ఒక రాష్ట్రం’ అని అమరజీవి త్యాగాన్ని స్మరించుకున్నారు. ‘అమరజీవి... చిరంజీవి’ అని పేర్కొన్నారు. ఈ విగ్రహానికి ‘ఏపీ ఆత్మగౌరవం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’ అనే పేరు పెట్టాలని కోరినట్లు లోకేశ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్