నెల్లూరు జిల్లాలో.వైసీపీకి.గట్టి షాక్
అమరావతి, 16 మార్చి (హి.స.) నెల్లూరు,:నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, చిల్లకూరుకు చెందిన కీలక నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణ రెడ్డి ప్రయాణ సమాచార
నెల్లూరు జిల్లాలో.వైసీపీకి.గట్టి షాక్


అమరావతి, 16 మార్చి (హి.స.)

నెల్లూరు,:నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, చిల్లకూరుకు చెందిన కీలక నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణ రెడ్డి ప్రయాణ సమాచారం అందుకున్న పోలీసులు, ఆయనను రేణిగుంట విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కలవకూరు సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద గతంలో జరిగిన ఒక దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

కలవకూరు సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద గతంలో జరిగిన ఒక దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఘర్షణలు, భౌతిక దాడులకు సంబంధించి నమోదైన కేసులో సత్యనారాయణ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే కేసులో పెళ్లకూరు మండల ఎంపీపీ శేఖర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో బలమైన పట్టున్న కామిరెడ్డి అరెస్ట్ తో స్థానిక వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande