
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తిరుమల: భక్తుల సౌకర్యార్థం 2026 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్ల నమోదు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఈ టికెట్లకు ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం డిప్‌లో ఎంపిక చేస్తారు.
డిప్‌లో ఈ-టికెట్లు పొందిన వారు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి. 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు