ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తెలంగాణ అక్షర వెలుగు, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు (Nandini Sidhareddy) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 లభించింది. ఆయన కవితా సంపుటి ‘అనిమేష’ లో కరోనా కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛి
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025


హైదరాబాద్, 16 మార్చి (హి.స.)తెలంగాణ అక్షర వెలుగు, ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికు (Nandini Sidhareddy) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 లభించింది. ఆయన కవితా సంపుటి ‘అనిమేష’ లో కరోనా కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను హృద్యంగా చిత్రీకరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా, మంజీరా రచయితల సంఘం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఊపునిచ్చి, తెలంగాణ ఉద్యమానికి తన కవిత్వం ద్వారా గొప్ప సహకారం అందించి తెలంగాణ సాహిత్యానికి ఆయన గర్వకారణంగా నిలిచారు.

తెలంగాణ సాహిత్యానికి ప్రాధాన్యం..

నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. తన కలం ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆత్మ, జీవన విధానాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా తెలంగాణ సాహిత్యానికి అగ్రగామిగా నిలిచారు. ఆయన రచనలు కవిత్వం మాత్రమే కాకుండా తెలంగాణ జీవితం, ప్రజల సమస్యలు, ఉద్యమం వంటి అంశాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande