పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం: హోంమంత్రి అనిత
మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.
Anitha


హైదరాబాద్, 16 మార్చి (హి.స.)నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు హోం మంత్రి. అనంతరం అనిత మాట్లాడుతూ.. మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం, స్ఫూర్తి యావత్ తెలుగు జాతికి ఆదర్శమని తెలిపారు. 58 రోజుల కఠోర ఉపవాస దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో అమరజీవి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande