ఏపి.ట్రిపుల్ ఐటీ.లో 400, వందల తెలంగాణ విద్యార్ధులు
, హైదరాబాద్, 15 మార్చి (హి.స.) : దాదాపు 400 మంది తెలంగాణ విద్యార్థులు.. స్థానికేతరుల కోటా కింద ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నాలుగేళ్లుగా ఫీజ
ఏపి.ట్రిపుల్ ఐటీ.లో 400, వందల తెలంగాణ విద్యార్ధులు


, హైదరాబాద్, 15 మార్చి (హి.స.)

: దాదాపు 400 మంది తెలంగాణ విద్యార్థులు.. స్థానికేతరుల కోటా కింద ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ఐటీల్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు. దాంతో ఏపీ అధికారులు ఫీజుల గురించి అడిగినప్పుడల్లా.. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తుండటం.. వారు తెలంగాణ విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల చుట్టూ తిరగడం నిత్యకృత్యంగా మారింది. ఈ ధ్యాసలో పడి విద్యార్థులు చదువులపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారని.. వారి భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 15% స్థానికేతర కోటా కింద తెలంగాణ విద్యార్థులు ఏపీలో ప్రవేశం పొందే అవకాశం ఉండటంతో.. నూజివీడు, ఆర్కే వ్యాలీ (కడప జిల్లా), ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో నాలుగేళ్లలో సుమారు 400 మంది వరకు చేరారు. ఒక్కో విద్యార్థికి ట్యూషన్, హాస్టల్ ఫీజు కలిపి ఏడాదికి రూ.75 వేల నుంచి రూ.80 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.12 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరవుతుందని భావించి వందల మంది చేరినా.. నాలుగేళ్లుగా ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. ట్రిపుల్ ఐటీలలో చేరిన విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ.. తదితర వేర్వేరు సంక్షేమశాఖల పరిధిలో ఉండటం.. వారంతా వేర్వేరు ప్రాంగణాల్లో ఉండటంతో.. ప్రభుత్వంపై బలంగా ఒత్తిడి తేలేకపోతున్నామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. దాంతో ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యం చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సర్కారు వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande