కోర్టుకు ఈడుస్తా జాగ్రత్త.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కవిత వార్నింగ్
హైదరాబాద్, 15 మార్చి (హి.స.) మూసీ ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతున్నామనే విషయాన్ని బ్యాంకులకు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం ఆ వివరాలు చెప్పడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు ఇచ్చ
Kavita warning


హైదరాబాద్, 15 మార్చి (హి.స.)

మూసీ ప్రాజెక్టు విషయంలో ఏం

చేయబోతున్నామనే విషయాన్ని బ్యాంకులకు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం ఆ వివరాలు చెప్పడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ లోనైనా డీపీఆర్ ఇస్తారని భావిస్తే కేవలం ఫేజ్-1 కు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించారన్నారు. ఇవాళ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. మూసీ ప్రాజెక్టుపై సంపూర్ణమైన డీపీఆర్ ఇవ్వకపోవడంలోనే ప్రభుత్వం మోసం ఉందని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో ప్రీ ఫీజిబులిటీ రిపోర్టులో ఫేజ్-1 అభివృద్ధి కోసం రూ.5,641 వేల కోట్లు వ్యయం అవుతుందని చెప్పి తాజా ప్రెజెంటేషన్లో మాత్రం రూ. 6500-7000 వేల కోట్లు అవుతందని చెప్పారన్నారు. ఈ ఆరు నెలల్లోనే భారీగా పెంచారన్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధి పేరుతో 1430 ప్రాపర్టీలు కూల్చేసి వారికి కాలనీలు కట్టిస్తామని చెబుతున్నారు. కానీ వారితో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకువచ్చారని కవిత మండిపడ్డారు. ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగ్లో ఓ ప్రైవేట్ సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్నే బద్నాం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ధర్నా తర్వాత హైడ్రా నాలుగైదు వీడియోలు రిలీజ్ చేసింది. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీరియస్గా చెబుతున్నాను. ఆధారాలు లేకుండా నేను ఏమి మాట్లాడను.నార్సింగ్లో మార్చి 3వ తేదీన ధర్నా చేస్తే ఆ మరుసటి రోజు స్పందిస్తూ ఈ ప్రాపర్టీకి హైడ్రాకు సంబంధం లేదని, హైడ్రా రాక ముందే దీనికి అనుమతులు వచ్చాయి కాబట్టి మాకు సంబంధం లేదని చెబుతున్నారు.

అయితే 10 అక్టోబర్ 2025 హైదరాబాద్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక తహశీల్దార్ లేఖ రాస్తూ ఈ నిర్మాణాల వల్ల మూసీకి వరదకు కారణం అయిందని రాశారు. ఈ ప్రాజెక్టు వల్ల అందులోని నివాసం ఉండబోయే వారికి ఆ చుట్టుపక్కల వారి ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి ఇప్పుడు మళ్లీ సిగ్గు లేకుండా వీడియోలు తీసి పెడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమైనా గ్రాఫిక్ డిజైనర్లా? కంటెంట్ క్రియేటర్లా? నిజం మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు ఎదురుదాడి చేయడం తమాషా అయిపోయిందన్నారు. 'మిస్టర్ రంగనాథ్ మిమ్మల్ని మేము కోర్టుకు ఈడిస్తాం. ఆరు ఫిర్యాదులు చేస్తే వాటిపై చర్యలు తీసుకునేందుకు మీ ధైర్యం ఎక్కడికి పోయింది? గతంలో మీరిచ్చిన లేఖను నేను బయట పెడితే మీరు మీ ప్రభుత్వం దూకి చస్తారు'. సదరు రియల్టపైకి వెళ్లేందుకు దమ్ముందా రేపు పద వెళ్తాం బుల్డోజర్లు తీసుకురావాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నేను చేసిన ఆందోళన నేపథ్యంలో హైడ్రా చేసిన ట్వీట్లను ఇవాళ సాయంత్రం లోపు డిలీట్ చేయాలని రేపు ఉదయం పరువు నష్టం దావా వేస్తానన్నారు. చూద్దాం ఎక్కడి వరకైనా వెళ్లామన్నారు. పేదవారి ఇళ్లను కూల్చివేస్తున్న మీరు వీటిని ఎందుకు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఇలాగే తయారయ్యాయన్నారు. మీకు మాత్రమే కాదు మాకు లాయర్లు ఉంటారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande