
ఒడిశా, 15 మార్చి (హి.స.)
దేశంలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సబ్యుడు నకుల్ సహా మొత్తం 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACM), మరో ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరంతా ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్సాస్ (INSAS), నాలుగు ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో DCMగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇతనిపై రూ.22 లక్షల రివార్డు ఉంది. ఈ మావోయిస్టు బృందం బసధారా-ఘుమ్హార్-నాగాబలి డివిజన్ పరిధిలో పనిచేస్తూ కలహాండి, రాయగడ, కంధమాల్ జిల్లాల్లో చురుకుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నకుల్ మహారాష్ట్రకు చెందినవాడు కాగా, మిగతా సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..