
నల్గొండ, 15 మార్చి (హి.స.)
నల్గొండ జిల్లాలో నేటి మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాంపల్లి మండలం దేవత్పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. కాగా ఈ ఘోర
ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు