ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య
హైదరాబాద్‌, 15 ,మార్చి (హి.స.) ఉప్పల్, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పాత స్నేహితుడే కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకార
ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చిలకానగర్ లో  ఏ ఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య


హైదరాబాద్‌, 15 ,మార్చి (హి.స.)

ఉప్పల్, ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పాత స్నేహితుడే కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన సుధీర్(35) చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్. చిలుకానగర్లో ఉండే ఆటోడ్రైవర్ సంతోష్నాయక్తో స్నేహం ఉంది. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్లో చాటింగ్ జరిగింది. ఆ సమయంలో మాటామాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.

ఆదివారం రాత్రి చిలుకానగర్ ప్రాంతంలోని ఆదర్శనగర్లో ఉన్న ఖాళీ స్థలం వద్ద ఆదివారం రాత్రి కలుసుకున్నారు. సుధీర్, తన స్నేహితుడు ఇమ్రాన్ఖాన్తో వచ్చారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సంతోష్నాయక్ కత్తి తీసి సుధీర్పై విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో సుధీర్, ఇమ్రాన్ఖాన్ పరుగులు తీశారు. ఉప్పల్-చిలుకానగర్ మార్గంలోని ఆదర్శనగర్ సాయిబాబా ఆలయ ప్రాంతంలో సుధీర్ పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande