ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కటకటాల్లోకి
అమరావతి, 16 మార్చి (హి.స.)ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్రెడ్డితోపాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తేలిన ఆయన సోదరుడు రితేశ్రెడ్డి, నమిత్శర్మకు కూడా కోర్ట
ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో  తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కటకటాల్లోకి


అమరావతి, 16 మార్చి (హి.స.)ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్రెడ్డితోపాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్గా తేలిన ఆయన సోదరుడు రితేశ్రెడ్డి, నమిత్శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మహేశ్కుమార్తోపాటు మిగిలిన నిందితులందరికీ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రోహిత్రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుపుకొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున వారందరినీ ఫాంహౌస్ నుంచి తరలించిన పోలీసులు.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు కాకుండా ఫ్యూచర్ సిటీ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడే వారిని విచారించి.. ఆ తరువాత హైదరాబాద్కు తీసుకెళ్లి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande