శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ గుట్టూరు 44 జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం
అమరావతి, 16 మార్చి (హి.స.) పెనుగొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు కూడలిలో 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామాన
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ గుట్టూరు 44 జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం


అమరావతి, 16 మార్చి (హి.స.)

పెనుగొండ: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు కూడలిలో 44వ జాతీయ రహదారిపై బెంగళూరు వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య (41) అనే వ్యక్తి మృతి చెందగా, శ్రీన అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రుడ్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి సంతాపూర్ నుంచి అంజయ్య, శ్రీనా, శ్రీకాంత్ అనే డైయిరీ ఫామ్ నిర్వాహకులు ముగ్గురు టమాటా నారు చూసేందుకు కర్ణాటకలోనే చింతామణికి వెళుతుండగా మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. సంఘటనాస్థలంలోని అంజయ్య మృతిచెందగా శ్రీనాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande