విజయవాడలోని స్టార్ హోటళ్లలో మెనూలో 45 రకాల నుండి 15 కు కుదింపు
విజయవాడ16 మార్చి (హి.స., విజయవాడలోని స్టార్హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు, అల్పాహార హోటళ్లు, కర్రీపాయింట్లకు గ్యాస్ సెగ తాకింది. చిన్న హోటళ్లు, బండ్లపై వ్యాపారం చేసేవాళ్లు ముందస్తుగా వారం రోజులకు సరిపడా గ్యాస్ను ఉంచుకుంటారు. ఆదివారానికి ఈ గ
విజయవాడలోని స్టార్ హోటళ్లలో  మెనూలో 45 రకాల నుండి 15 కు కుదింపు


విజయవాడ16 మార్చి (హి.స., విజయవాడలోని స్టార్హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్కోర్టులు, అల్పాహార హోటళ్లు, కర్రీపాయింట్లకు గ్యాస్ సెగ తాకింది. చిన్న హోటళ్లు, బండ్లపై వ్యాపారం చేసేవాళ్లు ముందస్తుగా వారం రోజులకు సరిపడా గ్యాస్ను ఉంచుకుంటారు. ఆదివారానికి ఈ గ్యాస్ అయిపోవడంతో.. కొరత ప్రభావం స్పష్టంగా కనిపించింది. చాలామంది చిరు వ్యాపారులు ఆదివారం దుకాణాలు మూసేశారు. తెరిచినవాళ్లు కూడా.. పదార్థాలను తగ్గించేశారు. బ్లాక్మార్కెట్లోనూ గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో సోమవారం నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతోంది. స్టార్, పెద్ద హోటళ్లలోనూ ఆహార పదార్థాల సంఖ్యను తగ్గించేయడంతో.. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా జరిగే వ్యాపారంపైనా ప్రభావం పడింది.

విజయవాడలోని స్టార్ హోటళ్లపై గ్యాస్ కొరత ప్రభావం స్పష్టంగా పడింది. ఇప్పటికే ప్రభుత్వ సూచనల మేరకు.. బఫే మెనూలోని ఆహార పదార్థాల సంఖ్యను కుదిస్తున్నారు. ఇప్పటివరకూ 45 రకాలకు పైగా మెనూలో ఉండగా.. ప్రస్తుతం 15కు తగ్గించారు. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కొన్నిరకాల మాంసాహార, శాకాహార కూరలు, రోటీలు ఇలాంటి వాటితోనే మెనూ సిద్ధం చేస్తున్నారు. యుద్ధం ప్రభావం తగ్గేవరకూ ఇదే పరిస్థితి ఉంటుందనే బోర్డులు కూడా త్వరలో పెట్టబోతున్నారు. ముందుజాగ్రత్తగానే బఫే మెనూను లిమిటెడ్ ఫుడ్ పేరుతో తగ్గించినట్టు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande