దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఇరాన్ డ్రోన్ దాడితో చెలరేగిన మంటలు
దుబాయ్, 16 మార్చి (హి.స.) ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పీక్స్కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dibai International Airport) సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్ (Fuel
huge-explosion-at-dubai-airport-fire-caused-by-iranian-


దుబాయ్, 16 మార్చి (హి.స.)

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పీక్స్కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dibai International Airport) సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇంధన ట్యాంక్ (Fuel Tank)పై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఈ మంటలు చెలరేగాయి. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది.

కాగా, ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఇప్పటివరకు యూఏఈ (UAE) పై సుమారు 1,800 కంటే ఎక్కువ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. గత వారం కూడా విమానాశ్రయంపై జరిగిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande