ఐసిస్ ఆన్లైన్ మాడ్యూల్తో సంబంధాలు.. డెంటల్ విద్యార్థి అరెస్టు
ఢిల్లీ, 17,మార్చి (హి.స.) ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్నవారు, వారికి మద్దతిచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)కు చెందిన ఆన్లైన్ మాడ్యూల్తో సం
ఐసిస్ ఆన్లైన్ మాడ్యూల్తో సంబంధాలు.. డెంటల్ విద్యార్థి అరెస్టు


ఢిల్లీ, 17,మార్చి (హి.స.) ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్నవారు, వారికి మద్దతిచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)కు చెందిన ఆన్లైన్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్న ఓ యువకుడిని ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh)లో ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకొంది. నిందితుడు 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి హారిష్ అలీగా గుర్తించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్లో ఐసిస్ అనుబంధ నెట్వర్క్ కార్యకలాపాలపై నిత్యం నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో సహారన్పుర్ జిల్లాకు చెందిన హారిష్ గురించి నిఘా అధికారులకు తెలిసింది. నిందితుడికి సోషల్మీడియా ద్వారా ఐసిస్ హ్యాండ్లర్లు, మద్దతుదారులతో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) రెండో సంవత్సరం చదువుతున్న హారిష్ను ఆదివారం అరెస్టు చేశారు.

ఉగ్ర భావజాలం ఉన్న వ్యక్తులను నియమించుకోవడానికి, ఐసిస్ ప్రచారానికి వర్చువల్గా ప్రైవేట్ నెట్వర్క్లను ఉపయోగించి హారిష్ పలు గ్రూపులను ఏర్పాటుచేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతోపాటు ప్రత్యేక గ్రూప్ను కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. భారత్తో సహా విదేశాల్లోని ఐసిస్కు చెందిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగించాడని పేర్కొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నిఘా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande