పొట్టి శ్రీరాములు స్మృతి.వనానికి రాజధాని ప్రాంతంలో గత ఏడాది మంత్రి లోకేష్.శంకుస్థాపన
అమరావతి, 16 మార్చి (హి.స.) :పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి రాజధాని ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబరు 3న మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు రెవెన్యూలో ఎన్-15 రోడ్డు పక్కనే 6.8 ఎకరాల భూమిని ఇందుకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణ బాధ్యతలను ఫౌండర
పొట్టి శ్రీరాములు స్మృతి.వనానికి రాజధాని ప్రాంతంలో గత ఏడాది మంత్రి లోకేష్.శంకుస్థాపన


అమరావతి, 16 మార్చి (హి.స.)

:పొట్టి శ్రీరాములు స్మృతి వనానికి రాజధాని ప్రాంతంలో గత ఏడాది సెప్టెంబరు 3న మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు రెవెన్యూలో ఎన్-15 రోడ్డు పక్కనే 6.8 ఎకరాల భూమిని ఇందుకు ప్రభుత్వం కేటాయించింది. నిర్మాణ బాధ్యతలను ఫౌండర్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, సభ్యులు తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని సోమవారం విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రాకేశ్ వెల్లడించారు. సోమవారం ఉదయం 11.15 గంటలకు అమరావతిలోని శాఖమూరు పార్కు వద్ద జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని కాంస్య విగ్రహం ప్రారంభిస్తారని తెలిపారు. కాగా, శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా 6.80 ఎకరాల స్థలంలో మొదటి దశ పనులు పూర్తయ్యాయి. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టింది. విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. రెండో దశలో ఇక్కడ మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ను నిర్మించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande