కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి.. ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు తయారీ కేంద్రా
కల్తీ ఆహారం


హైదరాబాద్, 17 మార్చి (హి.స.)

రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్న కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్న రెండు వేర్వేరు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సుభాన్ కాలనీ, లక్ష్మీగూడ ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాలు తయారవుతున్నట్లు అందిన సమాచారంతో మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎటువంటి అనుమతులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 'లక్కీ ఫుడ్స్ ' (Lucky Foods Company) కంపెనీ యజమాని అబ్దుల్ హక్తో పాటు 'జీ ఫుడ్స్' (Zee Foods) యజమాని మహ్మద్ కమరుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అదేవిధంగా, ఈ దాడుల్లో సుమారు రూ.1,10,000 విలువైన కల్తీ ఆహార పదార్థాలు, వాటి తయారీకి ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ (DCP) హెచ్చరించారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande