ఇలాంటి వారు పార్టీకి అవసరమా ? ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారంపై సీఎం సీరియస్
అమరావతి, 18 మార్చి (హి.స.) ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రతో సమావేశమైన సీఎం .. ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువకుడు, రాజకీయ నేపథ్యం ఉందని
సీఎం చంద్రబాబు


అమరావతి, 18 మార్చి (హి.స.)

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రతో సమావేశమైన సీఎం .. ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువకుడు, రాజకీయ నేపథ్యం ఉందని అవకాశం ఇస్తే.. ఇలా పార్టీలకు వెళ్లి డ్రగ్స్ తీసుకోవడం ఏంటంటూ ఫైరయ్యారు. ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటివారిని పార్టీ మోయాలా? అని ప్రశ్నించారు. క్రమశిక్షణ, విలువలు పాటించకుండా, వాటిని ఉల్లంఘించి రాజకీయాలు చేయాలనుకునేవారు ఎంతటివాళ్లైనా సరే ఉపేక్షించేది లేదన్నారు.

ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘ రాజకీయాలు చేయగలరని సీఎం తెలిపారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇకపై ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని సూచించారు. మూడు నెలల్లో సుపరిపాలనతో పాజిటివ్ పర్సెప్షన్ మరింత పెరగాలని తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేల పనితీరుపై.. కచ్చితమైన డేటాతో సీఎం చంద్రబాబు నివేదికలు ఇచ్చారు. మైక్రోలెవల్లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సీఎం వెల్లడించారు. కాగా.. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని ఎమ్మెల్యేలు అడగ్గా.. వాటిని విడుదల చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande