తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనం కోసం నిరీక్షణ
తిరుమల18 మార్చి (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. బుధవారం ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్ల
తిరుమల


తిరుమల18 మార్చి (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 22 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. బుధవారం ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లలోకి వెళ్లే భక్తులకు 10-12 గంటల సమయం పడుతుందని పేర్కొంది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి 4-6 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని వివరించింది.

నిన్న (మంగళవారం) శ్రీవారిని 70,002 మంది భక్తులు దర్శించుకోగా.. 21, 738 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు సమకూరింది. కాగా.. ఉగాది పర్వదినం రోజున సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లను జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 12, 1, 2, 3, రాత్రి 8, 10 గంటల టైమ్ స్లాట్ టోకెన్లను శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్సుల్లో ఈరోజు ఇవ్వనున్నారు. అలాగే శ్రీవారిమెట్టు వద్ద.. రేపు మధ్యాహ్నం 12 గంటల స్లాట్, రాత్రి 8, 9 గంటల స్లాట్లకు సంబంధించి 2000 టోకెన్లను పంపిణీ చేయనున్నారు. కాగా.. వరుస సెలవుల నేపథ్యంలో గురువారం నుంచి తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేసిన టీటీడీ.. అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టింది

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande