
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)గోవులను అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనం మంగళవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైంది. పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో వేగంగా వెళ్తూ.. యూటర్న్ తీసుకునే క్రమంలో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న 10 ఎద్దులు, 4 ఆవులకు గాయాలయ్యాయి. మూగజీవాలు రోడ్డుపై పడి విలవిల్లాడటం చూసిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి, వాటిని వేరే వాహనంలో యుగతులసి గోమాతక్షేత్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో శివకుమార్ మాట్లాడుతూ.. గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోతే, యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్