
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. హ్యామ్ రోడ్లకు 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారన్నారు. ‘‘ హ్యామ్ రోడ్ల ద్వారా కాంగ్రెస్కు వేల కోట్లు వస్తాయి. ఈ కమీషన్లను 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలి. సీవోటీ అనుమతి.. 5 శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలి. మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలి. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. సీవీసీ, ఆర్బీఐ సహా అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్