
మెదక్, 17 మార్చి (హి.స.)
జిల్లాలోని ప్రజలందరికీ మెరుగైన
వైద్య సేవలు అందించడమే లక్ష్యమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాపన్నపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 157 సబ్ సెంటర్లు, 19 PHCలలో స్క్రీనింగ్ కార్యక్రమం జరిగిందన్నారు. మొత్తం 1307 మందికి బీపీ పరీక్ష, డయాబెటిస్, క్యాన్సర్ స్క్రీనింగ్, హిమోగ్లోబిన్ పరీక్ష తదుపరి పరీక్షల కోసం 313 రక్త నమూనాలు తీసుకోవడం జరిగిందన్నారు. స్క్రీనింగ్ సమయంలో గుర్తించిన అనుమానాస్పద కేసులను తదుపరి పరీక్షలు మరియు చికిత్స కోసం తగిన ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, డిప్యూటీ డిఎంహెచ్వో హరిప్రసాద్, మెడికల్ ఆఫీసర్ అన్వర్, సిహెచి చందర్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు