అసెంబ్లీలో నేడు కేటీఆర్ కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంప
Seethaka


హైదరాబాద్, 17 మార్చి (హి.స.)

నిండు సభలో మహిళా సంక్షేమంపై

ప్రతిపక్ష నేత కేటీఆర్ (KTR) ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, బాధ్యత గల ప్రతిపక్షంగా దీనికి సహకరించాలని ఆమె కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ. 57 వేల కోట్లకు పైగా రుణాలను మంజూరు చేశామని గణాంకాలతో వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు ఎగతాళి చేయడం సరికాదని హితవు పలికారు. 'మేము చేస్తున్న పనులను పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది?' అని మంత్రి సీతక్క నిలదీశారు. మొదటి నుంచి కేటీఆర్కు మహిళలంటేనే చిన్నచూపని, అందుకే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేక నిప్పులు చెరుగుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande