డ్రగ్ టెస్టుకు రేవంత్ రెడ్డి రెడీ.. బీఆర్ఎస్కు మహేశ్ కుమార్ గౌడ్ చాలెంజ్
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్లలా గంజాయి, కొకైన్ దొరుకుతోందని, పదేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎ ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. కొందరు నా
Mahesh Kumar


హైదరాబాద్, 17 మార్చి (హి.స.)

రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్లలా గంజాయి, కొకైన్ దొరుకుతోందని, పదేళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎ ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని ఇంతకన్న సిగ్గుచేటు శాసనమండలిలో మాట్లాడిన ఆయన... డ్రగ్ టెస్టుకు (Drug Test) సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సిద్ధం అని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ యువనాయకుడు కేటీఆర్ (KTR) కూడా ముందుకు రావాలని చాలెంజ్ విసిరారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తం అని మీరు ముందుకు వస్తే ఉందా అని నిలదీశారు. ఇవాశ నేను ముఖ్యంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకుని ఈ సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి బీ-ఫామ్లు ఇచ్చిందో వారందరిని డ్రగ్ టెస్టుకు తీసుకువస్తామని అలాగే బీఆర్ఎస్ కూడా పార్టీ బి-ఫామ్స్ ఎవరెవరికి ఇచ్చిందో వారందరిని టెస్టులకు తీసుకురావాలన్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది మీ నాయకుడు కాదా? అలాంటి వారికి వత్తాసు పలకవద్దని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్లున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పదేళ్లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తెలంగాణను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువచ్చిందని అన్నారు.

డ్రగ్స్ మాటెత్తగానే మీ నాయకుడి పేరు బయటకు ఎందుకు వస్తోంది? ఇవాళ సామాన్యులు తమ పిల్లలు ఈ మాదక ద్రవ్యాల నుంచి కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, పదేళ్లలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గంజాయి, కొకైన్ సరఫరా అయిందని ఇది తాను ఆన్ రికార్డుగా చెబుతున్నానన్నారు. మీ మాజీ శాసనసభ్యులు డ్రగ్ తీసుకుని పట్టుబడితే ఇప్పటి వరకు ఆయనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా డ్రగ్స్ తీసుకుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అని నిలదీశారు. మద్దుపదార్థాలతో అంధకారం చేసిన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని దారికి తెస్తున్నారన్నారు. గతంలో టెస్టులకు రాకుండా భయపడ్డది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande