పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని నియమించాలి: కోమటిరెడ్డి
టీపీసీసీ పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
Komati


హైదరాబాద్, 17 మార్చి (హి.స.)టీపీసీసీ పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలన్నారు. ఆయన ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ అని కొనియాడారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్ అని.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారన్నారు. ఆయన పీసీసీ చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande