మిత్తల్ ఉక్కు కర్మాగారానికి శరవేగంగా శంకుస్థాపనకు పనులు సాగుతున్నాయి
నక్కపల్లి,, 18 మార్చి (హి.స.) రాష్ట్రాభివృద్ధికే తలమానికం కానున్న ఆర్సెలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ఇండియా (ఏఎన్ఎంఎస్) ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 23న భూమి పూజకు ముహూర్తం ఖరారు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండట
మిత్తల్ ఉక్కు కర్మాగారానికి శరవేగంగా శంకుస్థాపనకు పనులు సాగుతున్నాయి


నక్కపల్లి,, 18 మార్చి (హి.స.) రాష్ట్రాభివృద్ధికే తలమానికం కానున్న ఆర్సెలార్ మిత్తల్ నిపాన్ స్టీల్ ఇండియా (ఏఎన్ఎంఎస్) ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 23న భూమి పూజకు ముహూర్తం ఖరారు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తుండటంతో అవసరమైన ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలై ఉంది.

రెండు దశల్లో అయిదు వేలకుపైగా ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంటును తొలిదశలో రెండు వేల ఎకరాల్లో సిద్ధం చేయనున్నారు. దీన్నుంచి ఏడాదికి ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ఈ క్రమంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని పాటిమీద, తమ్మయ్యపేట, మూలపర్ర ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న కూడలిలో పెడుతున్నారు. ఈ ప్రాంతం ఖాళీగా ఉండటంతో వేలాదిమందితో సభావేదిక ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు.

తుప్పలు తొలగించి కంకర పోసి చదును చేశారు. కొద్దిదూరంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎంతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ముఖ్య అతిథులుగా రానున్నారు. 30 వేల మంది కూర్చేనేందుకు వీలుగా జర్మన్షెడ్లు వేయిస్తున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని వాహనాల్లో రప్పించారు. ఇప్పటికే వేదిక పనులు చేస్తున్నారు. దీనికి సమీపాన హెలిప్యాడ్ నిర్మాణ పనులు చేపట్టారు.

ఈ ప్రాంతంలో తుప్పలు తొలగించి మట్టి, గ్రావెల్ పోసి పటిష్ఠ పరుస్తున్నారు. ఇందుకోసం దాదాపు 60 ఎకరాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ పనులన్నీ రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. పనులపై మంత్రి అనిత పలుమార్లు సమీక్షించారు. అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర సైతం సమీక్షించారు. ఏర్పాట్లు, భద్రత తదితర విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని వీరు ఆదేశించారు. చేయాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande