ఇంటర్ విద్యార్దులకు నైపుణ్యాన్ని తెలుసుకునేలా రూపాయి కి ఆన్లైన్ పోటీ పరీక్షల
తిరుపతి, 18 మార్చి (హి.స.), ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలలో తమ నైపుణ్యాన్ని తెలుసుకునేలా ఓ అధ్యాపకుడు రూపాయి ఫీజుతో ఆన్లైన్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఈ పరీక్షలు రాయడం ద్వారా తమ ప్రతిభకు సాన పెట్టుకోవచ్చని చెబుత
ఇంటర్ విద్యార్దులకు నైపుణ్యాన్ని తెలుసుకునేలా రూపాయి కి ఆన్లైన్ పోటీ పరీక్షల


తిరుపతి, 18 మార్చి (హి.స.), ఇంటర్ విద్యార్థులు పోటీ పరీక్షలలో తమ నైపుణ్యాన్ని తెలుసుకునేలా ఓ అధ్యాపకుడు రూపాయి ఫీజుతో ఆన్లైన్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఈ పరీక్షలు రాయడం ద్వారా తమ ప్రతిభకు సాన పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షల్లో యువత పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారిలో నైపుణ్యాలను, ప్రతిభను వెలికితీసి ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం మంచుగుంటపల్లెకు చెందిన అధ్యాపకుడు రెళ్లా రెడ్డెప్ప ఒక వెబ్సైట్ను తయారు చేశారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంపీసీఎగ్జామ్.కామ్ అనే ఈ వెబ్సైట్ ద్వారా రూపాయి చెల్లించి ఎవరికివారు పరీక్ష రాసుకుని తమ ప్రతిభను పరీక్షించుకోవచ్చు. ఇందుకు అవసరమైన ప్రశ్నావళిని సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. 24/7 ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ల్యాప్ ట్యాప్, మొబైల్, ట్యాబ్ ద్వారా యువత పరీక్షలు రాసి ఫలితాన్ని వెంటనే తెలుసుకోవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande