2029లోనే అసెంబ్లీ ఎన్నికలు: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, 18 మార్చి (హి.స.) తెలంగాణ రాజకీయ భవిష్యత్తు మరియు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు ఆసక్తికర అంశాలను
CM revanth


న్యూఢిల్లీ, 18 మార్చి (హి.స.)

తెలంగాణ రాజకీయ భవిష్యత్తు

మరియు రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలకు సీఎం చెక్ పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కఠినంగా స్పందించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపీ (పుట్టా మహేష్ కుమార్) పట్టుబడ్డారు. ఆయన స్టేషన్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఇందులో మా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని స్పష్టం చేశారు.

తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ, వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande