
హైదరాబాద్, 18 మార్చి (హి.స.)
హిందువులు కుటుంబ నియంత్రణ (Family Planning) పాటించవద్దని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Padi Rakesh Reddy పిలుపునిచ్చారు. దేశంలో ముస్లిం జనాభా పెరుగుతున్నదని వారిని తట్టుకోవాలంటే హిందూ జనాభా (Hindu Population) పెరగాలన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. గతంలో ఒక్కో ఫ్యామిలీ 23 మంది వరకు సంతానం కలిగి ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణలో రాబోయేది హిందూ ప్రభుత్వమేనని తాను 2 జూన్ 2029న హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇదే చివరి ప్రభుత్వం అని కాంగ్రెస్కు చివరి ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. మా ప్రభుత్వంలో సీఎం ఎవరనేది నేను మాట్లాడనన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను ముస్లింలు ఆక్రమించుకోబోతున్నారని వారిన ప్రశ్నించేవారు కరువయ్యారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు