నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా లక్ష్యం..మంత్రి పొంగులేటి
హైదరాబాద్, 18 మార్చి (హి.స.) డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు (Accreditation Cards) ఇవ్వాలన్నదే మా లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas
మంత్రి పొంగులేటి


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)

డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు (Accreditation Cards) ఇవ్వాలన్నదే మా లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి.. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు వెళ్లబోదన్నారు.

వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని(Digital Media Policy) తీసుకు రాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వరలోనే ఫైనల్ చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande