బాపట్ల జిల్లాలో ప్రజలు.పోగొట్టుకున్న 40 లక్షల విలువైన సెల్ ఫోన్ లు ప్రత్యేజ పోలీసు.బృందం.రికవరీ
బాపట్ల, 18 మార్చి (హి.స.) జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.40 లక్షల విలువైన సెల్ఫోన్లను ప్రత్యేక పోలీసు బృందం రికవరీ చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు రికవరీ చేసిన సెల్ఫోన్లను యజమా
బాపట్ల జిల్లాలో ప్రజలు.పోగొట్టుకున్న 40 లక్షల విలువైన సెల్ ఫోన్ లు ప్రత్యేజ పోలీసు.బృందం.రికవరీ


బాపట్ల, 18 మార్చి (హి.స.) జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.40 లక్షల విలువైన సెల్ఫోన్లను ప్రత్యేక పోలీసు బృందం రికవరీ చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులు రికవరీ చేసిన సెల్ఫోన్లను యజమానులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా వెంటనే www.ceir.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఫోన్లను వంద శాతం రికవరీ చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పోలీసు బృందం పనిచేస్తోందన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని ఫోన్లు కొనుగోలు చేయరాదని సూచించారు. సెకండ్హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ఇబ్బందిపడతారని హెచ్చరించారు. గతంలో సెల్ఫోన్ల రికవరీ 30 శాతం ఉండగా.. ప్రస్తుతం 60 శాతానికి పెంచామని తెలిపారు. డీఎస్పీలు జగదీష్నాయక్, మెయిన్, శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు సూర్యనారాయణ, నారాయణ, మౌలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande