రాష్ట్రం లో. కొందరు ఆర్డీవో ల బదిలీ పోస్టింగ్లకు చంద్రబాబు అడ్డు
అమరావతి, 18 మార్చి (హి.స.)రాష్ట్రంలో కొందరు ఆర్డీవోల బదిలీ, పోస్టింగులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆర్డీవోలు, డీఎస్పీల పోస్టింగులకు సంబంధించి కడప జిల్లాకు చెందిన ఓ లాబీయిస్టు బేరసారాలు నడుపుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ప్రచ
రాష్ట్రం లో.  కొందరు ఆర్డీవో ల బదిలీ పోస్టింగ్లకు చంద్రబాబు అడ్డు


అమరావతి, 18 మార్చి (హి.స.)రాష్ట్రంలో కొందరు ఆర్డీవోల బదిలీ, పోస్టింగులను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆర్డీవోలు, డీఎస్పీల పోస్టింగులకు సంబంధించి కడప జిల్లాకు చెందిన ఓ లాబీయిస్టు బేరసారాలు నడుపుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఖాళీగా ఉన్న అన్ని డివిజన్లకు ఆర్డీవోలను నియమించాలని అధికారులు జాబితాలు పంపించగా.. వాటిలో కొన్నింటిపై సీఎం అనుమానం వ్యక్తంచేస్తూ.. చర్చించాలని రాసి ఫైలును వెనక్కి పంపించినట్టు తెలిసింది. ఇంకోవైపు 9 మంది ఆర్డీవోలు, ఐదుగురు జిల్లా రెవెన్యూ అధికారు(డీఆర్వో)లను రాష్ట్రప్రభుత్వం మంగళవారం బదిలీ చేసి పోస్టింగులిచ్చింది. సీఎస్ సాయిప్రసాద్ ఈ మేరకు జీవో 583ని జారీచేశారు.

డీఆర్వో కె.మల్లికార్జునుడు కడప జిల్లాకు బదిలీ కాగా.. ఎం.విశ్వేశ్వరనాయుడు విశాఖకు, వి.విశ్వేశ్వరరావు-ఏలూరు, ఎం.నూకరాజు-అల్లూరి జిల్లా, కె.పద్మలత పశ్చిమగోదావరికి బదిలీ అయ్యారు. ఆర్డీవోల్లో కె.వెంకటశివ.. ఆత్మకూరు(నంద్యాల)కు, సనపాల సుధాసాగర్-విజయనగరం, కాకర ఆనంద్రావు-కొవ్వూరు, బి.శ్రీదేవి-రేపల్లె, ఎస్.ప్రేమ్నాధ్కుమార్-ధర్మవ రం, ఎ.కుమార్-తిరువూరు, ఎ.మురళి-కడప, డి.ఎలిషా-కావలి, కె.బాలకృష్ణ నరసరావుపేటకు నియమితులయ్యారు. వీటిలో కొన్ని బదిలీల్లో సిఫారసులే బాగా పనిచేసినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande