బాపట్లలో కోట్ల లో ఎగనామం వందల కొద్ది.బాధితులు
గుంటూరు 18 మార్చి (హి.స.): ఒకటి, రెండూ కాదు.. రకరకాల స్కీములు.. అందులో రూ.25 వేలు, రూ.లక్ష, రూ.3 లక్షలు, గోల్డ్ స్కీమ్లు.. ప్రతి నెలా ఊహించని ఆదాయం వస్తోందని అమాయకుల్ని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి వ్యవహారం ఇది. స్కీముల పేరిట జరిగ
బాపట్లలో కోట్ల లో ఎగనామం వందల కొద్ది.బాధితులు


గుంటూరు 18 మార్చి (హి.స.): ఒకటి, రెండూ కాదు.. రకరకాల స్కీములు.. అందులో రూ.25 వేలు, రూ.లక్ష, రూ.3 లక్షలు, గోల్డ్ స్కీమ్లు.. ప్రతి నెలా ఊహించని ఆదాయం వస్తోందని అమాయకుల్ని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి వ్యవహారం ఇది. స్కీముల పేరిట జరిగిన భారీ స్కాములో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

బాపట్లకు చెందిన అన్నం వెంకట పూర్ణచంద్రరావు ట్రేడ్ దోస్త్, వారాహి బిజినెస్ కన్సల్టెంట్ సంస్థను గుంటూరు అరండల్పేట 16వ లైనులోని రెండో అడ్డరోడ్డులో రెండేళ్ల క్రితం నెలకొల్పాడు. పైసా పెట్టుబడి లేకుండా మాయమాటలతో నమ్మించాడు. స్కీముల గురించి వివరించి డబ్బు వసూళ్లకు ఏజెంట్లను నియమించుకున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది రూ.లక్షల్లో నగదు చెల్లించారు. చివరికి డబ్బు చెల్లించిన వారితో పాటు ఏజెంట్లకు సైతం టోపీ పెట్టి పరారయ్యాడు.

ప్రతి స్కీములో 20 మంది సభ్యుల్ని నియమించుకుని వారితో ముందుగానే డబ్బు కట్టించుకొని లక్కీ డ్రా పేరిట నెలకు ఒకరికి కొంత మొత్తం చెల్లించడం, మిగతా వారికి పది శాతం చెల్లించేవాడు. రూ.25 వేలు స్కీముకు.. అంత మొత్తం ముందుగానే అందరి వద్దా తీసుకొని డ్రా తీసి గెలుపొందిన వారికి రూ.25 వేలు ఇచ్చి.. మిగిలినవారికి రూ.2,500 ఇస్తున్నాడు. ఇదేవిధంగా రూ.లక్ష స్కీముకు, రూ.3 లక్షల స్కీముకు డ్రాలో గెలుపొందిన వారికి అంతే మొత్తం చెల్లించి, మిగిలిన వారికి 10 శాతం చొప్పున ఇచ్చేవాడు. ఇలా ప్రతి నెలా చేస్తున్నాడు. దీంతో నమ్మకం రావడంతో వందలాది మంది పెద్ద ఎత్తున నగదు చెల్లించారు.

గతేడాది డిసెంబరు వరకు కొంత మందికి సొమ్ము చెల్లించాడు. జనవరి నుంచి డ్రాలో గెలుపొందిన వారికి సైతం ఎటువంటి సొమ్ము చెల్లించడంలేదు. అడుగుతుంటే రోజులు వెళ్లబుచ్చుతూ వచ్చాడు. రెండు రోజుల క్రితం సెల్ స్విచాఫ్ చేసి పరారయ్యాడు. ఇందులో గుంటూరుకు చెందిన కోటేశ్వరి తన సొంత సొమ్ము రూ.20 లక్షలు, బంధువులు, మిత్రుల వద్ద రూ.27 లక్షలు వరకు చెల్లించారు. మొత్తం రూ.47 లక్షలు వరకు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించినవారు వందల సంఖ్యలో ఉన్నారు. హీనపక్షం రూ.100 కోట్లు వరకు ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు. పోలీసులు ఇంకా బాధితులు వస్తారని కేసు నమోదు చేసేందుకు వేచి చూస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande