మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. మంత్రి పొన్నం
హైదరాబాద్, 18 మార్చి (హి.స.) రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలి వేదికగా స్పష్టం చేశారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో భాగంగా ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం తీసుక
మంత్రి పొన్నం


హైదరాబాద్, 18 మార్చి (హి.స.)

రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతే

ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలి వేదికగా స్పష్టం చేశారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో భాగంగా ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టామని మంత్రి తెలిపారు. 600 బస్సులకు మహిళలనే యజమానులను చేశాం. ఈ వినూత్న పథకం ద్వారా మహిళలు కేవలం ప్రయాణికులే కాదు, వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. బ్యాంక్ ఈఎంఐలు చెల్లించిన తర్వాత కూడా ఒక్కో మహిళా యజమానికి నెలకు రూ.70 వేల నికర ఆదాయం మిగులుతోంది అని పొన్నం వివరించారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, దీనికి తోడు ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్ స్టేషన్లలో రూ.100 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. అలాగే, ప్రజా రవాణాను మరింత చేరువ చేసేందుకు ఏటూరునాగారం, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా బస్ డిపోలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో ఉండి కార్మికులు మరణిస్తే, వారి కుటుంబాలకు రూ.1 కోటి భీమా అందేలా ప్రత్యేక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది కార్మికుల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande