కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ ఇంట్లో చోరీ
గుడివాడ 18 మార్చి (హి.స.): కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈశ్వర్కుమార్ సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగి బుధవారం గుడివాడ వచ్చ
కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ ఇంట్లో చోరీ


గుడివాడ 18 మార్చి (హి.స.): కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈశ్వర్కుమార్ సతీమణి మధురిమ రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగి బుధవారం గుడివాడ వచ్చారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో పాటు సుమారు 10 కిలోల వెండి, పూజా సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో పట్టణంలోని వన్టౌన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. కఠారి ఈశ్వర్కుమార్ వ్యాపార రీత్యా హైదరాబాద్, బెంగళూరుల్లో ఉంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande