మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అరెస్ట్
మదనపల్లి , 18 మార్చి (హి.స.) మదనపల్లి దగ్ధం కేసు(Madanapalle Fire Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy RamachandraReddy) అనుచరుడు మాధవరెడ్డి సీఐడీ పోలీసులు(CID Police)
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు అరెస్ట్


మదనపల్లి , 18 మార్చి (హి.స.)

మదనపల్లి దగ్ధం కేసు(Madanapalle Fire Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy RamachandraReddy) అనుచరుడు మాధవరెడ్డి సీఐడీ పోలీసులు(CID Police) అరెస్ట్ చేశారు. మరో నిందితుడు తుకారాంను సైతం అదుపులోకి తీసుకుని ఇద్దర్నీ పోలీస్ స్టేషన్కు తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మదనపల్లి ఆర్డీవో కార్యాలయం(Madanapalle RDO Office)లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కీలకమైన ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ముఖ్యంగా జిల్లాలోని భూములకు సంబంధించిన ఫైల్స్ పూర్తి కాలిపోయాయి.

కాగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో భూములు పెద్ద సంఖ్యలో కబ్జాలకు గురైనట్లు గుర్తించిన నేపథ్యంలో మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కేసును సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా నిందితులు ఏ3 నిందితుడు మాధవరెడ్డిని ఏ4 నిందితుడు తుకారాంను సీఐడీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande