అరణ్యాల్లో అగ్నికీలలు.. దావానలంలో మూగజీవాల ఆర్తనాదాలు
అమరావతి, 18 మార్చి (హి.స.) పక్షుల కిలకిలారావాలతో, లేళ్ళ తుళ్ళింతలతో కళకళలాడాల్సిన ఆ పచ్చని ఒడి, నేడు మరుభూమిగా మారుతోంది. మీరు చూస్తున్న ఆ మంటలు కేవలం ఎండుటాకులను కాల్చడం లేదు, నోరులేని వేల జీవరాశుల ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి తన ''పైశా
అరణ్యాల్లో అగ్నికీలలు.. దావానలంలో మూగజీవాల ఆర్తనాదాలు


అమరావతి, 18 మార్చి (హి.స.)

పక్షుల కిలకిలారావాలతో, లేళ్ళ తుళ్ళింతలతో కళకళలాడాల్సిన ఆ పచ్చని ఒడి, నేడు మరుభూమిగా మారుతోంది. మీరు చూస్తున్న ఆ మంటలు కేవలం ఎండుటాకులను కాల్చడం లేదు, నోరులేని వేల జీవరాశుల ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి తన 'పైశాచిక ఆనందం' కోసం రాజేసిన ఒక చిన్న నిప్పురవ్వ, వేసవిలో అడవి తల్లి గుండెకు చిచ్చు పెడుతోంది.

వన్యప్రాణుల ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి?

మంటలు అలుముకుంటుంటే అడవిలో వినిపించే శబ్దాలు హృదయవిదారకం. ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకోగల శక్తి తల్లి పక్షులకు ఉంది. కానీ, గూళ్ళలో ఉన్న రెక్కలు రాని పసి పిల్లలు? ఆ వేడికి గూటిలోనే మాడిపోతుంటే, ఆ తల్లి పక్షులు చేసే హాహాకారాలు అరణ్యం దాటి రావడం లేదు.

మంటల వేగానికి పరుగెత్తలేని తాబేళ్లు, పొదల్లో దాక్కునే కుందేళ్లు, నేల మీద ప్రాకే పాములు సజీవ దహనమవుతున్నాయి. ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి అవి చేసే ప్రయత్నం, చివరకు బూడిద కుప్పల కింద అంతమై పోతున్నాయి. వేసవి ఎండలకు తోడు ఈ అగ్ని కీలలు తోడవ్వడంతో, నీటి కోసం వెతుకులాడే వన్యప్రాణులు దిక్కుతోచని స్థితిలో మంటల మధ్య చిక్కుకుంటున్నాయి. కోడూరు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పోరుమామిళ్ల, వేంపల్లి, పులివెందుల, జమ్మలమడుగు ఇలా జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవులు నేడు అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande