రాష్ట్ర ప్రజలకు అలర్ట్..ఈ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
పోలవరం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
rain


అమరావతి, 18 మార్చి (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి లాంటి జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక మిగిలిన ఏపీలోని జిల్లాల్లో తేలిక పాటి జల్లులు పడతాయని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే రాయలసీమలోని పలు జిల్లాల్లో ఆకాశాన్ని మబ్బులు కమ్మేయగా, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ వర్షం పడుతోంది.

ఎండాకాలం ప్రారంభంలోనే వర్షాలు కూడా పడుతున్నాయి. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా వర్షాలు ఉన్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాలలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్, అదిలాబాద్ లాంటి జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. ఇక మిగిలిన జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande