భద్రాద్రి లో నేడు ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం, 19 మార్చి (హి.స.) భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వ తేది వరకూ జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల27న శ్రీరామ నవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల
భద్రాచలం


భద్రాచలం, 19 మార్చి (హి.స.)

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి

తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వ తేది వరకూ జరగనున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల27న శ్రీరామ నవమిని పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో సీతారాముల కల్యాణం, 28 న పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం వీక్షించడానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. సీతారామచంద్ర స్వామి వారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో, చాందిని వస్త్రాలు, చలువ పందిళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణ ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుని రానుండటంతో అధికారులు ఆ దిశగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 2 లక్షల లడ్డు ప్రసాదం, 5లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాలలోని భక్తుల సౌకర్యం కోసం కల్యాణ టికెట్స్ ఆన్లైన్లో ఉంచారు. రామాలయం అధికారులు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రముఖులను ఆహ్వానించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande