
,అమరావతి 20 మార్చి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ (Ugadi Celebrations) ఘనంగా జరుపుుకన్నారు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా తన కుమారుడు దేవాన్ష్ తో కలిసి పూజగదిలో కూర్చుని ఉన్న ఫోటోలను మంత్రి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు వైరల్గా మారాయి. లోకేశ్ షేర్ చేసిన ఫోటోలలో దేవుడి ఫోటోల పక్కన ఓ బొమ్మ ఉండటంతో ఆ అనుమానాస్పద బొమ్మ ఏంటని కొందరు ప్రశ్నించగా మరికొందరు కుద్రపూజలకు వాడే చేతబడి బొమ్మ మీ ఇంటి పూజ మందిరంలో ఉండటం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడి మందిరం పవిత్ర స్థలం కదా అలాంటి పూజ గదిలో క్షుద్రపూజలు చేస్తున్నారా అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
తమ పూజ గదిలోని బొమ్మపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. 'మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం.. ఇది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ, చిన్న శివలింగం. దేవాన్ష్ శివుడిపై భక్తితో ఈ బొమ్మల్ని తయారు చేశాడు. మేము దానిని ఒక జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హరహరమహాదేవ్' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV