టీటీపీ కార్యాలయంలో పని చేసే వ్యక్తి దారుణ హత్య
శ్రీకాకుళం, 20 మార్చి (హి.స.) శ్రీకాకుళం)లో దారుణ హత్య జరిగింది. స్థానిక ఉమెన్స్ కాలేజ్ రోడ్డు(Womens College Road)లో మోహన్ అనే వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం(Tdp Office)లో పని చేస్తున్నట్లు సమాచా
ap-a-brutal-murder-took-place-in-srikakulam-


శ్రీకాకుళం, 20 మార్చి (హి.స.)

శ్రీకాకుళం)లో దారుణ హత్య జరిగింది. స్థానిక ఉమెన్స్ కాలేజ్ రోడ్డు(Womens College Road)లో మోహన్ అనే వ్యక్తిని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం(Tdp Office)లో పని చేస్తున్నట్లు సమాచారం. పట్టపగలే బహిరంగంగా ఈ దాడి జరిగింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు

హత్య అనంతరం నిందితుడు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు లొంగిపోవడంతో కోర్టులో ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande