యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి.. భట్టి విక్రమార్క
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ గాంధీభవన్లో ''శ్రీ పరాభవ నామ సంవత్సర'' ఉగాది ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్
బట్టి విక్రమార్క


హైదరాబాద్, 19 మార్చి (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ గాంధీభవన్లో 'శ్రీ పరాభవ నామ సంవత్సర' ఉగాది ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతి చిలుకూరు శ్రీనివాస్ మూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గాంధీభవన్లో ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉగాది వేడుకలను నిర్వహించిన మహేష్ కుమార్ గౌడ్ని అభినందించారు. 'ఈ పరాభవ నామ సంవత్సరంలో సమాజంలోని దుష్టశక్తులకు పరాభవం కలగాలి. రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాలి' అని ఆయన ఆకాంక్షించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో ఉండాలని, రాష్ట్రం పాడిపంటలతో విలసిల్లాలని కోరారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గనిర్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందని కొనియాడారు. 'ఈ ఏడాది ఎవరూ ఎవరినీ పరాభవం చేసుకోకుండా, అందరూ కలిసికట్టుగా శాంతిసౌఖ్యాలతో ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి' అని ఆయన పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande