కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోండి. ఈసీకి సూచిన ఢిల్లీ హైకోర్టు.
న్యూఢిల్లీ, 19 మార్చి (హి.స.) కొత్త రాజకీయ పార్టీ నమోదు వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. ''తెలంగాణ ప్రజా జాగృతి'' పేరుతో నూ
జాగృతి కవిత


న్యూఢిల్లీ, 19 మార్చి (హి.స.)

కొత్త రాజకీయ పార్టీ నమోదు

వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. తెలంగాణ ప్రజా జాగృతిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు ఎన్నికల కమిషన్ చెప్పగా లోపాలన్నీ సరిచేసినట్లు తాజాగా కవిత తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామని కోర్టుకు వివరించారు. ఈసీ స్పందిస్తూ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో కోర్టు విచారణ ముగించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande