ప్రజాపాలన రైతు ఉత్సవాలు.. సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల ఆహ్వానం
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు (Prajapalana Farmers'' Festival.) కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత
మంత్రి తుమ్మల


హైదరాబాద్, 19 మార్చి (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

చేపట్టనున్న ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు (Prajapalana Farmers' Festival.) కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని Chief Minister Revanth Reddy) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆహ్వానించారు . గురువారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) కలిసి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల నేటి నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రైతు ఉత్సవాల షెడ్యూల్ను వివరించి, అందులో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతుల సంక్షేమాన్ని చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు, మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే వేదికగా రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్థానిక రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడి, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు భరోసా కల్పించడంలో మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ చూపిస్తూ, ఈ ఉత్సవాలను విజయవంతం చేసేలా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande