
అమరావతి, 19 మార్చి (హి.స.)
పండుగను ఆనందంగా జరుపుకోండి.. అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎక్స్ వేదికగా తెలుగులో ఆయన ఉగాది విషెస్ తెలియజేశారు. ‘శుభప్రదమైన ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సంప్రదాయాలతో ముడిపడి ఉండటంతో పాటు కొత్త శక్తికి, ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక. నూతన సంవత్సరానికి ఉగాది నాంది పలుకుతుంది. రాబోయే సంవత్సరం ఆనందాలు, విజయాలు, ఆరోగ్యంతో నిండి ఉండాలని ప్రార్థిస్తున్నాను. తమ ఆకాంక్షలను చిత్తశుద్ధితో కొనసాగించేలా, సమాజ శ్రేయస్సుకు సానుకూలతతో దోహదపడేలా ఈ ఏడాది ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల విషెస్..
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచులతో జీవన తత్వాన్ని సరికొత్త ఆలోచనలతో నూతన వసంతాన్ని ఆవిష్కరించే ఉషస్సు ఉగాది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని సీఎం చంద్రబాబు నాయుడు విషెస్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV