
సిరిసిల్ల జిల్లా 20 మార్చి (హి.స.)వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రం నడుపుతున్న మహేశ్ వినూత్న ఆలోచనతో డీజిల్తో పనిచేసే స్టవ్ తయారుచేశారు. చిన్నపాటి విద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ పైపు ద్వారా... డీజిల్ను మరో పైపు ద్వారా పొయ్యి దగ్గరకు పంపి.. అక్కడ వెలిగించడం ద్వారా మంట వచ్చేలా దీనిని రూపొందించారు.
అవసరాన్ని బట్టి మంటను హెచ్చుతగ్గులు చేసుకునే వీలుంది. ఒక లీటరు డీజిల్తో గంట నుంచి రెండు గంటలు పొయ్యి మండుతుందని మహేశ్ తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరతో పోల్చితే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు. దీని తయారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతోపాటు నాలుగు రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు. ఇది చూసిన మరో రెండు హోటళ్ల నిర్వాహకులు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ