
అమరావతి, 20 మార్చి (హి.స.)
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో త్వరలో డ్రోన్లు, రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా బహుళ అంతస్తులు, ఎత్తైన భవనాలు, రసాయన పరిశ్రమలు వంటి వాటిలో ప్రమాదాలు జరిగినప్పుడు వీటిని వినియోగించనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షలు చేపట్టి, పలు యూజ్ కేసులు సిద్ధం చేశారు. ఇకపై క్షేత్రస్థాయిలో పూర్తిగా వాడాలని నిర్ణయించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో తొలుత 6 డ్రోన్లు, ఒక రోబో కొనుగోలు చేయనున్నారు. మే నెలకల్లా ఇవి అందుబాటులోకి వస్తాయి. వాటి పనితీరు ఆధారంగా రెండో దశలో మరిన్ని కొంటారు. ముఖ్యంగా మంటల వ్యాప్తిని గుర్తించి, అదుపు చేసేందుకు వీటిని వినియోగిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ