తెలుగుదేశం పార్టీ.కార్యాలయం.లో ఘనంగా ఉగాది వేడుకలు
అమరావతి, 20 మార్చి (హి.స.)తెలుగువారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు,
తెలుగుదేశం పార్టీ.కార్యాలయం.లో ఘనంగా ఉగాది వేడుకలు


అమరావతి, 20 మార్చి (హి.స.)తెలుగువారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధాంతి మాచిరాజు వేణుస్వామి చెప్పిన పంచాంగ శ్రవణం విన్నాక రాష్ట్ర భవిష్యత్తుపై మరింత నమ్మకం కలిగిందని పల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, నీలాయపాలెం విజయ్కుమార్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande