తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శిలాతోరణం వరకు క్యూ లైన్లు
తిరుమల, 20 మార్చి (హి.స.)దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న
తిరుమల


తిరుమల, 20 మార్చి (హి.స.)దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీకెండ్ సెలవుల ప్రభావంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో శ్రీవారి ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉండటంతో, క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు దాటి బయటకు వచ్చి శిలాతోరణం వరకు చేరుకున్నాయి. నేడు ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లలోకి ప్రవేశించిన భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న వారికి 3 నుంచి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

గురువారం ఒక్కరోజే 57,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చాయని టీటీడీ (TTD) అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande