ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు
ఢిల్లీ,, 20 మార్చి (హి.స.)దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఢిల్లీ-నోయిడా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది. రహదారులు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు


ఢిల్లీ,, 20 మార్చి (హి.స.)దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఢిల్లీ-నోయిడా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది. రహదారులు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2023 తర్వాత మార్చి నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే అని వాతావరణ శాఖ తెలిపింది. గత మూడేళ్లలో మార్చి నెలలో ఢిల్లీలో అత్యధికంగా సగటున 9.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని రోజులు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో మోస్తరు వర్షం, మెరుపులు, వడగళ్ల వానతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande